ETV Bharat / jagte-raho

తాళం వేసున్న ఇంట్లో చోరీ... పక్కింటివాళ్లు చూడటంతో పరారీ - bhuvagiri news

తాళం వేసున్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీకి పాల్పడ్డారు. చోరీ సమయంలో వచ్చిన శబ్ధానికి పక్కింటివాళ్లు లేచి గమనించగా... దొంగలు పరారయ్యారు. ఈ ఘటన భువనగిరి మండలం నందనంలో జరిగింది.

theft in nandanam village in bhuvanagiri mandal

author img

By

Published : Oct 3, 2020, 12:06 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా నందనం గ్రామంలోని రచ్చ నాగయ్య ఇంట్లో రాత్రి 2 గంటల ప్రాంతంలో చోరీ జరిగింది. ఇంటి యజమానులు తాళం వేసి ఊరెళ్లారు. ఇదే అదునుగా తీసుకున్న దొంగలు... తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. నగదు, బంగారం తీసుకున్నారు. బీరువాను పగులగొడుతుండగా వచ్చి శబ్ధానికి పక్కింటి వ్యక్తి చూసి గట్టిగా అరవటం వల్ల... దుండగులు పారిపోయారు.

మొత్తం ముగ్గురు దుండగులు చోరీ చేయటానికి వచ్చారని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నాడు. దుండగులు ముగ్గురూ అక్కడే మద్యం సేవించి చోరీకి పాల్పడ్డట్లు ఆనవాళ్లు ఉన్నాయి. రూ.21 వేల నగదు, కొంత బంగారం చోరీకి గురైనట్లు తెలిసింది. భువనగిరి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి.. తోటి ఉద్యోగుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.