రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి హుండీలోని ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
ఉదయాన్నే గమనించిన ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దాదాపు రూ.5లక్షల విలువగల ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి : భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ