ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో రోగి మృతి - ఆదిలాబాద్​ జిల్లా నేర వార్తలు

ఆదిలాబాద్​లోని రిమ్స్​​ ఆసుపత్రిలో అనుమానాస్పద మరణాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ రోగి మరణించిన ఘటన మరవకముందే తాజాగా వైద్యం కోసం వచ్చిన మరో వ్యక్తి మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

the-patient-died-in-a-suspicious-condition-in-Adilabad-rims
అనుమానాస్పద స్థితిలో రోగి మృతి
author img

By

Published : Dec 21, 2020, 12:08 PM IST

ఆసుపత్రి భవనం రెండవ అంతస్తు పై నుంచి పడి ఓ రోగి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్​ లోని రాజీవ్​గాంధీ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (రిమ్స్)లో జరిగింది. జిల్లా లోని భీంసరి గ్రామానికి చెందిన కృష్ణపల్లి గంగన్న(34)మూడ్రోజుల క్రితం అనారోగ్యంతో రిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. ఆసుపత్రి భవనం పై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది ఆత్మహత్య..? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నెల రోజుల వ్యవధిలో ఆదిలాబాద్ రిమ్స్‌లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.

ఇదీ చదవండి: ఎంఐఎం నుంచి ఫారుఖ్‌ అహ్మద్ సస్పెండ్.. తాటిగూడలో భారీ భద్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.