ఓటుకు నోటు కేసు కుట్రలో సెబాస్టియన్ ఫోన్ ద్వారా కీలక వివరాలు బయటపడ్డాయని న్యాయస్థానానికి అవినీతి నిరోధక శాఖ తెలిపింది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ... అనిశా కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.
రేవంత్ రెడ్డితో కలిసి సెబాస్టియన్ కుట్ర పన్నినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. అయితే విచారణ జాప్యం చేసేందుకు నిందితులు ఒకరి తర్వాత మరొకరు పిటిషన్లు దాఖలు చేస్తున్నారని పేర్కొంది. డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేసి అభియోగాల నమోదుపై విచారణ ప్రారంభించాలని కోరింది. ఓటుకు నోటు కేసుపై శుక్రవారం విచారణ జరగనుంది.
- ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై జిల్లా పార్టీ అధ్యక్షుడి దాడి