భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరిలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు స్నేహితులు సరదాగా స్నానం చేసేందుకు నదిలో దిగారు. కరీంనగర్‌కు చెందిన విజయ్ నీళ్లలోనే మాట్లాడుకుంటూ లోతున్న ప్రాంతానికి వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు.
అధికారులు గల్లంతైన యువకుని కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. విజయ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు అతని స్నేహితులు తెలిపారు. ఈరోజు ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.