ETV Bharat / jagte-raho

'నా తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. రక్షణ కల్పించండి' - The daughter's complaint against the father is the latest news

కన్న కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

The daughter lodged a complaint at the police station against the father
'నా తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. రక్షణ కల్పించండి'
author img

By

Published : Nov 21, 2020, 8:24 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ మండల కేంద్రంలో నివాసముంటున్న బోడ్డుపల్లి లక్ష్మయ్యకు నలుగురు కూతుళ్లు. తరచు భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడం వల్ల 17 ఏళ్ల క్రితం భార్య తన నాలుగో కూతురిని తీసుకుని తల్లిగారింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్య భార్తలు విడివిడిగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

రెండు సంవత్సరాల క్రితం వీరి రెండో కుమార్తె హత్యకు గురైంది. అనంతరం గత ఏడాది పెద్ద మనుషుల ఒప్పందంతో భార్య... భర్తతో కాపురం చేసేందుకు వచ్చింది. డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు అవుతుండేవి. ఈ తరుణంలో తల్లి, కూతురు స్థానిక పోలీసు స్టేషన్​లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తండ్రిపై పిర్యాదు చేశారు.

స్థానిక ఎస్​ఐను వివరణ కోరగా ఓ మైనర్ బాలిక తన తల్లితో కలసి వచ్చి తనపై తండ్రే అసభ్యకరంగా ప్రవర్తిస్తూన్నాడని... రక్షణ కావాలని పిర్యాదు చేసిందని తెలిపారు. వీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. బాలికను (సఖీ) భువనగిరికి పంపించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.

కాగా స్థానికంగా మాత్రం భార్యాభర్తల మధ్య ఉన్న ఆర్థిక విభేదాలే కేసు వరకు దారితీసి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.