ETV Bharat / jagte-raho

క్లిక్‌ చేస్తే చాలు.. మాయచేసి ఉచ్చులోకి దించుతారు - సీపీ మహేశ్ భగవత్ తాజా వార్తలు

స్నేహం పేరుతో ఆన్‌లైన్‌లో వల విసురుతారు. ఆదమరిస్తే అంతే... అందినకాడికి దోచేస్తారు. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలను ఎంచుకుంటున్న సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటూ... నిత్యం ఎందరో సర్వం కోల్పోతున్నారు. ఇదే తీరుగా... దిల్లీ వేదికగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

క్లిక్‌ చేస్తే చాలు.. మాయచేసి ఉచ్చులోకి దించుతారు

author img

By

Published : Jan 9, 2021, 4:08 AM IST

ఫేస్‌బుక్‌ వేదికగా మహిళలు, పురుషులు, యువతను టార్గెట్‌ చేస్తూ వారితో స్నేహం చేసి అందినకాడికి దోచుకొంటున్న అంతర్జాతీయ ముఠా సభ్యుల్ని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. ఘనా దేశానికి చెందిన అక్‌పలు గాడ్స్‌టైం(26), లిబిరీనియన్‌ దేశానికి చెందిన అడ్‌జెల్‌గిఫ్ట్‌ ఒసాస్‌(27), క్రోమాఒయిబో(24), నైజీరియాకు చెందిన ఎన్‌కెకికాన్ఫిడెన్స్‌ డేవిడ్‌(27), ఇహిగియేటర్‌ డానియల్‌(29) స్నేహితులు. ప్రధాన నిందితుడు ఆక్‌పాలు గాడ్స్‌టైం 2019 మార్చిలో టూరిస్టు వీసాపై దిల్లీకి వచ్చాడు. అనంతరం తన వీసాను వ్యాపార వీసాగా మార్చుకొన్నాడు. మిగతా నలుగురు స్నేహితులతో కలిసి దిల్లీలోని ఓ అపార్టుమెంటులో ఫ్లాట్‌ తీసుకొని తమ సైబర్‌క్రైం కార్యకలాపాలకు వేదికగా మార్చుకొన్నారు.

ప్రారంభించిన తీరిది..

  • ప్రధాన నిందితుడు అక్‌పాలు గాడ్స్‌టైం సైబర్‌ నేరాలకు ప్రణాళిక వేస్తాడు. అడిజెల్‌గిఫ్ట్‌ఒసాస్‌ నకిలీ ధ్రువపత్రాలతో వైఫై కనెక్షన్‌ తీసుకొస్తాడు. ఎన్‌కెకికాన్ఫిడెన్స్‌ డేవిడ్‌ నకలీ ధ్రువపత్రాలతో సిమ్‌కార్డులు సంపాదిస్తాడు. వీటితో ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమాయకులకు ఫోన్లు చేసి వలలో వేస్తుంటారు. మరో నిందితుడు క్రోమాఒయిబో కస్టమ్స్‌ అధికారిగా నమ్మిస్తూ డబ్బు వసూలు చేస్తుంటాడు. ఇహిగేటర్‌ డానియల్‌ అమాయకుల నుంచి వచ్చే డబ్బు తమ ఖాతాలో పడేలా మధ్యవర్తుల ద్వారా కమిషన్‌ పద్ధతిలో పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తాడు.
  • ప్రధాన సూత్రధారి అక్‌పాలు గాడ్స్‌టైం పురుషులకు స్త్రీగా, స్త్రీలకు పురుషుడిగా నకిలీ ఫోటోలు పెట్టి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపుతాడు. ఎదుటి వారు రిక్వెస్ట్‌ను ఓకే చేశాక వారితో చాటింగ్‌ చేస్తుంటాడు. తను ఒంటరి అని చాలా డబ్బు ఉందని ఎవరూ లేరని నమ్మిస్తాడు. మాయలో పడ్డ అమాయకులకు తరచూ బహుమతులు పంపి ఆకట్టుకొంటాడు.

ఫిర్యాదుతో ఆటకట్టించారు.

రాచకొండ కమిషనరేట్‌ పరిధి మీర్‌పేట ఠాణాకు చెందిన సయ్యద్‌ ముస్తాక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇతనికి గతేడాది ఫేస్‌బుక్‌లో సోఫియా అలెక్స్‌ అనే అమ్మాయి పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్టు వచ్చింది. దానిని ఓకే చేశాడు. దీంతో ఇద్దరూ వాట్సాప్‌లో ఛాటింగ్‌, ఫోన్‌ కాల్స్‌ చేయడం ప్రారంభించారు. సోఫియా తాను ఆస్ట్రేలియాలో పుట్టానని లండన్‌లో ఉంటున్నానని, త్వరలో హైదరబాద్‌ వస్తున్నానని చెప్పింది. ఓ రోజు తాను ముంబయి ఎయిర్‌పోర్టుకు వచ్చానని ఫోన్‌ చేసింది. మరి కాసేపటికి మరో యువతి ముస్తాక్‌కు ఫోన్‌ చేసి తాను కస్టమ్స్‌ అధికారి అని సోఫియా అలెక్స్‌ నగదు, బంగారు గొలుసులతో వచ్చిందని కొన్ని పన్నులు చెల్లించాలని కోరింది. ఇది నమ్మిన ముస్తాక్‌ తన ఖాతా నుంచి రూ.4.83 లక్షలు వారి ఖాతాలోకి పంపాడు. అనంతరం ఆ ఫోన్‌లు మూగబోయాయి. గతేడాది నవంబరు 28న రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులు మకాం వేసిన ఫ్లాట్‌కు వెళ్లి అయిదుగురిని ట్రాన్సిట్‌ రిమాండ్‌పై ఇక్కడకు తీసుకొచ్చారు. వీరిపై హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 3 కేసులు ఉన్నాయని, మొత్తం ఏడు కేసులున్నట్లు సీపీ వెల్లడించారు.

ఇవీ చూడండి: ప్రాణం తీసిన వాట్సాప్​ ఫొటో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.