భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవాయి పేటలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో నిర్మించిన పిల్లర్ విరిగిపడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు.
ఇంటి వెనుక ఆవరణలో నిర్మించిన పిల్లర్‌కు ఉన్న తాడును పట్టుకుని పిల్లాడు వేలాడగా.. పిల్లర్ విరిగి మీద పడడంతో బాలుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చూడండి : గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్