ETV Bharat / jagte-raho

వాటర్ హీటర్ బకెట్లో చేయిపెట్టి బాలుడి మృతి - నిర్మల్​ జిల్లా నేరవార్తలు

వాటర్​ హీటర్​ ఓ బాలుడి ప్రాణాన్ని మింగేసింది. నీళ్లు వేడిచేసేందుకు బకెట్లో హీటర్​ పెట్టారు. కాస్త సమయం అయ్యాక.. నీళ్లు ఎంత వేడయ్యాయో తెలుసుకుందామని బాలుడు బకెట్లో చేయి పెట్టి చూశాడు. విద్యుదాఘాతంతో అక్కడకక్కడే దుర్మరణం చెందారు.

boy died in nirmal
వాటర్ హీటర్ బకెట్లో చేయిపెట్టి బాలుడి మృతి
author img

By

Published : Dec 13, 2020, 9:50 AM IST

నిర్మల్ జిల్లా దిలావార్​పూర్ మండలంలోని గుండంపల్లిలో విషాదం చోటుచేసుకొంది. 14 ఏళ్ల బాలుడు సిరిమని శివకుమార్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

శనివారం మధ్యాహ్నం ఇంట్లో స్నానానికని.. నీళ్లు వేడిచేసేందుకు బకెట్లో హీటర్​ పెట్టారు. కాస్త సమయం అయ్యాక.. నీళ్లు వేడయ్యాయో లేదో తెలుసుకుందామని బాలుడు బకెట్లో చేయి పెట్టి చూశాడు.. షాక్​ కొట్టి అక్కడకక్కడే మృతిచెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

20 ఏళ్లకు పుట్టిన ఏకైక సంతానం

గుండంపల్లి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సిరిమని నర్సవ్వ, ప్రభాకర్ దంపతులకు పెళ్లెన 20 ఏళ్లకు ఏకైక సంతానంగా శివకుమార్ జన్మించాడు, కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కుమారుడు పుడితే స్వామి దీక్ష తీసుకుంటానని మొక్కును ఈ ఏడాది నెరవేర్చే క్రమంలో ప్రభాకర్ 15 రోజుల క్రితం కన్నెస్వామిగా మాలాధారణ చేశాడు. ఇంతలోనే విద్యుదాఘాతం రూపంలో శివకుమార్‌ను మృత్యువు కబళించింది. శివకుమార్.. ముధోల్​లోని గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదుతున్నాడు. ఘటన స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇవీచూడండి: ముత్తంగిలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో టిప్పర్​ను ఢీకొని ఇద్దరి మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.