జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి భాజపా కార్యకర్తలు బయటకు వెళ్లేందుకు యత్నిచటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గేట్ లాగేందుకు ప్రయత్నంచిటంతో కాషాయ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. భాజపా కార్యకర్తలు పోలీసులను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.
ఫ్లెక్సీల విషయంలో గత కొద్ది రోజులుగా భాజపా, తెరాస మధ్య వివాదం సాగుతోంది. బుధవారం మంత్రి కొప్పల ఈశ్వర్ పర్యటనను అడ్డుకునేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమవటంతో అక్కడికి చేరుకున్న గులాబీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరిగి దాడి చేసుకున్నారు. అక్కడి చేరుకున్న పోలీసులు భాజపా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
గొల్లపల్లి పీఎస్కు పెద్ద ఎత్తున చేరుకున్న ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. లోపలున్న వారు బయటకు రావడానికి యత్నించటంతో ఉద్రిక్తత ఏర్పడింది. జగిత్యాల ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ వెంకటరమణ, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, సీఐలు గొల్లపల్లికి చేరుకుని పరిస్థతిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: తెరాస, భాజపాల బాహాబాహీ..