ETV Bharat / jagte-raho

దాబాలపై టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడులు.. యజమానులు అరెస్ట్​ - సిద్దిపేట సమాచారం

అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నారన్న సమాచారంతో దాబాలపై టాస్క్​ఫోర్స్, సీసీఎస్​ పోలీసులు దాడులు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని రెండు దాబాల యజమానులను, మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

Task force police raids on dabas in jagdevpur mandal  siddipet district
దాబాలపై కార్యదళం పోలీసుల దాడులు
author img

By

Published : Jan 9, 2021, 10:17 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవపూర్​ మండల కేంద్రంలోని రెండు దాబాలపై కార్యదళం, సీసీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నారన్న సమాచారంలో దాడులు చేశారు. మండలంలోని విష్ణు, వైష్ణవి దాబాల యజమానులు కరుణాకర్​, రాజులను, మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్​ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకై దాబాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు కార్యదళం సీఐ ప్రసాద్​ వెల్లడించారు. అక్రమంగా బెల్ట్​షాప్​ నిర్వహించినా, మద్యం సేవించేందుకు అనుమతించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో సీసీఎస్​ సీఐ నరసింహరావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 650 కిలోల గంజాయి సీజ్​.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.