నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బుడ్డగానితండాశివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.35,280 నగదు, 9 ద్విచక్రవాహనాలు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే సహించేది లేదని మరికల్ ఎస్సై మహ్మద్ నాసర్ హెచ్చరించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.
ఇదీ చూడండి: 23 వేలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 1,590 మందికి పాజిటివ్