కొవిడ్ 19కి విరుద్ధంగా నడిపిస్తున్న హైదరాబాద్ ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని డ్రీం వరల్డ్ వీడియో గేమ్ సెంటర్ఫై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. గేమింగ్ హౌస్ యజమాని సయ్యద్‌తో పాటు... 18మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆటగాళ్ల నుంచి 9వేల 555 రూపాయలు, 5 టీవీలు, 3 ప్లేయింగ్ స్టేషన్లు, 3 జాయ్ స్టిక్స్, 13 సెల్‌ఫోన్స్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దక్షిణ భారతంలో ఐసిస్ ఉగ్రవాదుల అలికిడి