ETV Bharat / jagte-raho

ఆదిలాబాద్​లో వ్యభిచార ముఠా అరెస్ట్ - task force and a joint police raided a brothel in Adilabad town

ఆదిలాబాద్ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, ఒకటో పట్టణ పోలీసులు కలిసి సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ ఎస్. రామకృష్ణ వెల్లడించారు.

task force and a joint police raided a brothel in Adilabad town
ఆదిలాబాద్​లో వ్యభిచార మూఠా అరెస్ట్
author img

By

Published : Jan 21, 2021, 11:05 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్, ఒకటో టౌన్​ పోలీసుల సంయుక్త దాడుల్లో.. నలుగురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ ఎస్. రామకృష్ణ వెల్లడించారు.

నిస్సహాయులైన మహిళలచే..

పట్టణంలోని కైలాష్ నగర్ కాలనికి చెందిన ఓ మహిళతో కలిసి నిందితుడు జర్నలిస్ట్ కాలనిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కొంత కాలంగా నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టణ పోలీసుల సహాయంతో చాకచక్యంగా దాడులు నిర్వహించారు.

కేసు నమోదు..

ఈ దాడుల్లో.. 11 మందిని అరెస్టు చేశారు, ఇందులో ప్రధాన నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ఏడుగురు విటులు ఉన్నారు. వారి నుంచి రూ.19,100 నగదు, 12 సెల్ ఫోన్లు, ఒక డైరీ, ఒక ఆటోతో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు, వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు నిర్వాహకులతో పాటు మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

ఇదీ చదవండి:'సిడ్నీ టెస్టును మధ్యలోనే ఆపేయమన్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.