హైదరాబాద్‌కు చెందిన జావేద్ గతంలో పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆటో నడుపుతూ కాలం గడిపాడు. ఆ ఆదాయం అతని జల్సాలకు సరిపోకపోవడం వల్ల మళ్లీ చోరీలకు పాల్పడ్డారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఓ వైన్స్ ముందు ఉన్న ద్విచక్రవాహనాన్ని కొట్టేసి దాని నెంబర్‌ప్లేట్‌ను కర్ణాటకకు చెందిన దానిగా మార్చేశాడు. దానిపై అతను కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ పరశురామ్ అనే వ్యక్తితో కలిసి వరుసగా మహిళల మెడల్లోని పుస్తెలతాళ్లను దొంగలించడం ప్రారంభించారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ వచ్చి కర్ణాటక- తెలంగాణ ప్రాంతాల్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. కాగా తాండూరు పోలీసులు పట్టణంలో వాహనతనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక వాహన ప్లేటు ఉన్న వీరిని ఆపి అనుమానిస్తే అసలు నిజాలు బయటపెట్టారు. పోలీసులు వద్ద జావేద్, పరశురామ్‌లు వారు చేసిన నేరాలును అంగీకరించారు. వారి వద్ద నుంచి 9 తులాల బంగారంతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. వారిపై గుల్బర్గా పోలీస్‌స్టేషన్‌లో అనేక చైన్‌స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..