సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన వడ్డానం మహేశ్ (35).. శుక్రవారం శ్రీశైలం పవర్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందాడు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో పనిచేస్తున్న అతడు.. కంపెనీ పనిమీద శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లాడని మృతుని బందువులు తెలిపారు.
మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చూడండి: జలవిద్యుత్‌కు ఆయువు పట్టు శ్రీశైలం ప్రాజెక్టు