ఈతకు వెళ్ళిన చిన్నారులు... విగతజీవులైనారు - raikod
చిన్నారుల సరదాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఆటవిడుపుగా ఈత కోసం వెళ్తూ... విగతజీవులై తేలుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోనూ ఇద్దరు ఐదో తరగతి విద్యార్థులు మృత్యు బారిన పడ్డారు.
ఈతకు వెళ్ళిన చిన్నారులు విగతజీవులై తేలారు
బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటున్న నగేష్, శ్రీధర్ ఐదో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని బావికి వెళ్లారు. ఒడ్డు అంచునే ఈదుదామని లోపలికి దిగిన నగేష్ మునిగి పోతుంటే కాపాడేందుకు యత్నించిన శ్రీధర్ కూడ నీటిలోనే మునిగిపోయాడు. స్థానిక ఈత గాళ్లతో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు.