ETV Bharat / jagte-raho

పాము కాటుకు ఇంటర్​ విద్యార్థిని బలి - student death due to snakebite

పాము కాటుకు గురై ఇంటర్​ చదివే విద్యార్థిని మృతి చెందింది. నిద్రిస్తున్న సమయంలోనే పాము కుట్టినా.. అది తెలుసుకుని ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థి తుదిశ్వాస విడిచింది.

student death due to snakebite in narayanpet district utnoo rmandal
పాముకాటుకు ఇంటర్​ విద్యార్థి బలి
author img

By

Published : Jan 16, 2021, 5:01 PM IST

పాము కాటుకు గురై ఇంటర్ చదివే అనురాధ అనే విద్యార్థిని మృతి చెందింది. నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలంలోని తిప్రాస్ పల్లె గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంట్లో నిద్రిస్తుండగానే తెల్లవారుజామున ఆమె పాముకాటుకు గురైంది. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు పరిస్థితి విషమించటంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు కళ్లముందే తిరిగిన కూతురు అర్ధాంతరంగా కళ్లు మూయటంతో అనురాధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి: పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. పెద్దలు వద్దనడంతో ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.