ETV Bharat / jagte-raho

నిషేధిత డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు

స్టెరాయిడ్స్​ను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 150 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

steroid injections seized at old city in hyderabad
నిషేధిత డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు
author img

By

Published : Sep 19, 2020, 7:21 PM IST

హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ (స్టెరాయిడ్స్​)ను సరఫరా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు. చాదర్​ఘాట్ పీఎస్​ పరిధిలో నివసించే ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. చాంద్రాయణగుట్ట జూబ్లీ కాలనీలో ఉండే మహమ్మద్​ షా ఫహాద్(28), చంచల్​గూడ కాలనీలో ఉండే షేక్​ అబ్దుల్​ ఒవైసీ(20)లను అదుపులోకి తీసుకున్నారు.

బహిరంగ మార్కెట్​లో 1.5 లక్షలు విలువ చేసే 150 ఇంజెక్షన్లను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను చాదర్​ఘాట్ పోలీసులకు అప్పగించారు. పాతబస్తీలోని వివిధ జిమ్​లలో ఈ నిషేధిత డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారని సమాచారం.

steroid injections seized at old city in hyderabad
నిషేధిత డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు

ఇవీ చూడండి: మట్కా ఆడుతున్న 8 మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.