నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లికి చెందిన బాలికతో కల్వకోల్ గ్రామానికి చెందిన సాయి కృష్ణ రెండేళ్లుగా సఖ్యతతో ఉంటున్నాడు. 20 రోజుల క్రితం కొల్లాపూర్ మండలం చింతలూరు గ్రామానికి చెందిన మరో అమ్మాయితో సాయికృష్ణకు నిశ్చితార్థం జరిగింది.
ఈక్రమంలో బాలిక అభ్యంతరం చెబుతుందని బావించిన సాయికృష్ణ ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు. ఆ పనిని విజయ్‌కి అప్పగించాడు. సోమవారం ఆ యువకుడు యువతిని తీసుకువచ్చి వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి సమీపంలో ఉన్న మామిడి తోట వద్ద వదిలి వెళ్ళాడు.
పెళ్లి విషయమై బాలిక, సాయి కృష్ణ మధ్య మాటలు నడిచాయి. నన్ను మర్చిపోవాలని తనకు మరో అమ్మాయితో నిచ్చితార్థం జరిగిందని సాయి కృష్ణ యువతి చెప్పాడు. కొంతసేపటికి యువతి తాను శీతల పానీయంలో విషం కలుపుకొని తాగానంటూ యువకుడిపై పడిపోయింది.
పక్క తోటలో ఉన్న బాబు సాయంతో ఆమెను పెబ్బేర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శీతల పానీయాన్ని ఎవరు తెచ్చారు? యువతే తెచ్చుకుందాం? లేక సాయికృష్ణే బలవంతంగా శీతల పానియాన్ని యువతికి తాగించాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఎస్పీ చెప్పారు. నిందితులు ఇద్దరు ఆ బాలికకు బంధువులే. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ వైద్య విద్యాసంస్థలకూ నీట్