ETV Bharat / jagte-raho

జన్మనిచ్చి తల్లయ్యింది.. మలివయసులో బరువైంది - భద్రాద్రి జిల్లా వార్తలు

కన్నతల్లినే ఇంటి నుంచి గెంటేసి.. నిలువ నీడ లేకుండా చేశాడో కసాయి పుత్రుడు. ఆఖరికి ఓ సత్రంలో తలదాచుకునే దుస్థితికి తీసుకువచ్చాడు. దిక్కుతోచని స్థితిలో పోలీస్​ స్టేషన్​ మెట్లెక్కింది ఆ మాతృమూర్తి.. తన ఇంటిని తనకు ఇప్పంచాలంటూ కన్నీటిపర్యంతమైంది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా భద్రాచలంలో జరిగింది.

bhadrachalam
జన్మనిచ్చి తల్లయ్యింది.. మలివయసులో బరువైంది
author img

By

Published : Jan 1, 2021, 11:18 PM IST

తొమ్మిది మాసాలు మోసిన తల్లే ఆ కుమారుడికి బరువైంది. కనిపెంచిన మమకారం మరచి.. చేరదీయాల్సిన వయసులో ఆ మాతృమూర్తికి నిలువ నీడలేకుండా చేశాడు. ఉన్న ఇంటి నుంచి బయటకు నెట్టి.. తాళాలు వేశాడు. దిక్కుతోచని స్థితిలో సత్రంలో తలదాచుకుంటూ బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది. తన ఇంటిని ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మెడికల్ కాలనీకి చెందిన అనసూర్య 65 ఏళ్ల వృద్ధురాలు. ఈమెకు ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు మరో చోటు నివాసం ఉంటుండగా.. మిగిలిన ఇద్దరు కుమారులతో ఆమె నివాసం ఉంటుంది. మూడు నెలల క్రితం అనసూర్య భర్త మరణించిన తర్వాత నుంచి చిన్న కొడుకు నగేశ్​.. తల్లితో గొడవలు పడుతున్నాడు. విసిగిపోయిన ఆ తల్లి.. భద్రాచలం పోలీసులను ఆశ్రయించింది. దాంతో ఇల్లు తనదేనంటూ తల్లి, అన్నయ్య దంపతులను ఉన్నపళంగా బయటకు పంపేశాడు. అనంతరం ఇంటికి తాళం వేశాడు.. ఆ సుపుత్రుడు. దీంతో రెండో కుమారుడు, అతని భార్యతో కలిసి ఓ సత్రంలో తలదాచుకుంటోంది. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని ప్రాదేయపడుతోంది.

చాలా రోజుల నుంచి గొడవ చేస్తున్నాడు. నిన్న మమ్మల్ని బయటకు నెట్టి తాళం వేశాడు. నిన్న కానిస్టేబుల్​ వచ్చినా తాళం తీయలేదు. రాత్రి ఓ సత్రంలో తలదాచుకున్నా.. మళ్లీ ఇవాళ పోలీసులు వచ్చారు. తాళం తీసి స్టేషన్​కు రమ్మంటే.. అక్కడికే వస్తామంటూ వెళ్లిపోయారు. నా భర్త బతికున్న సమయంలో బెదిరించి, భయపెట్టి ఇల్లు వారి పేరుమీద రాయించుకున్నారు. ఏం రాశారో చెప్పమంటే చెప్పమన్నారు. సంతకం పెట్టకుంటే పురుగుల మందు తాగుతామని బెదిరించారు. సంతకం పెట్టాక మూడు నెలల వరకు ఇంటి నుంచి బయటకు రానీయ్యలేదు.. ఈ విషయం ఎవరికైనా చెప్తే బతకవన్నారు.

- అనసూర్య, బాధితురాలు

జన్మనిచ్చి తల్లయ్యింది.. మలివయసులో బరువైంది

ఇవీచూడండి: కొత్త విధానాల పేరుతో రైతులను వేధించడం సరికాదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.