కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ వాలంటీర్‌గా నెమలి బాబురావు విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామంలో నివసిస్తున్న అత్తామామలు కోటా ముత్తయ్య(65), సుగుణమ్మ(60) దంపతులతో ఆస్తి వివాదం నడుస్తోంది. కొంత కాలంగా బాబూరావు వేధిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి కత్తితో అత్తామామలపై దాడి చేసి కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?