హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో పేద రోగుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితిని సామాజిక మాధ్యమం ద్వారా చూపించి... వారిని ఆదుకోవాలని కోరుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను చంద్రాయణగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సల్మాన్, ఆయుబ్ అనే నిందితులు... దాతలు ఇచ్చే డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వీరిపై బహదూర్‌పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోర్డు ఆదేశంతో 5 రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు.
హైదరాబాద్ యూత్ కౌరేజ్ అనే ఫేస్బుక్ పేజ్‌లో పోస్టు చేసి... దయనీయ స్థితిలో ఉన్న పేద రోగులకు దాతలు ఇచ్చిన డబ్బులను తమ అకౌంట్లలోకి మల్లించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి వీరిని రిమాండ్‌కు తరలించారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదైనట్టు వెల్లడించారు.