ETV Bharat / jagte-raho

భారీగా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు పట్టివేత - gutka

నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను గుర్తించి పోలీసులు సీజ్​ చేశారు. చంద్రాయణగుట్ట పీఎస్​ పరిధిలోని బండ్లగూడలోని ఓ స్టోర్​పై దాడి చేసి 8 లక్షల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు.

Seizure of heavily banned gutka and tobacco products in hyderabad
భారీగా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు పట్టివేత
author img

By

Published : Sep 20, 2020, 6:50 PM IST

హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పీఎస్​ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో ఆర్​ఎఫ్​ చాలియా స్టోర్​పై చంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న 8 లక్షల రూపాయల విలువ గల నిషేధిత గుట్కాతో పాటు విదేశీ సిగరెట్లు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్​ఎఫ్ చాలియా స్టోర్ యజమాని మహమ్మద్ షుకూర్​ని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రాయణగుట్ట పీఎస్​ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా భారీ మొత్తంలో నిషేధిత గుట్కాను నిల్వ ఉంచి పాన్ షాపులు, దుకాణదారులకు మహమ్మద్ షుకూర్ అమ్ముతున్నాడని సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. నిందితుడిపై చంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: భారీగా గుట్కా, రేషన్​ బియ్యం, నల్ల బెల్లం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.