అక్రమంగా తరలిస్తున్న 75 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద డీసీఎంలో సుమారు 75 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు.
డీసీఎం డ్రైవర్ అరెస్ట్...
రామడుగు నుంచి నిజామాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందల్వాయి ప్రాంతానికి చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డిచ్పల్లి పీఎస్‌కు తరలించినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ వెల్లడించారు.
ఇవీ చూడండి : సెల్ఫీ దిగుతూ జలపాతంలో పడి విద్యార్థిని గల్లంతు