ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ దగ్గర ఉన్న గుడిలో... సీతమ్మవారి విగ్రహం కిందపడి పగిలిపోయి ఉంది. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలియడం లేదని అర్చకులు తెలిపారు. ఆరుబయట ఉన్న ఆలయంలో పిల్లులు తిరుగుతుంటాయని... అవి తోయడం వల్ల విగ్రహం కిందపడిందా అనే అనుమానమూ వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: టౌన్షిప్లో దొంగల హల్చల్.. వారంరోజుల్లో నాలుగు చోరీలు