ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో సెక్యూరిటీ గార్డు మృతి

author img

By

Published : Dec 8, 2020, 6:02 PM IST

మేడ్చల్​ జిల్లా దుండిగల్​లోని పోచంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎంజీబీ మోటార్స్​లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి మరణించడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Security guard killed by electric shock in medchal dist dundigal
విద్యుదాఘాతంతో సెక్యూరిటీ గార్డు మృతి

మేడ్చల్​ జిల్లా దుండిగల్​లోని పోచంపల్లిలో విద్యుదాఘాతానికి గురైన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంజీబీ మోటార్స్​లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నరసింహ(45) నీళ్లు పడుతుండగా విద్యుత్​తీగ తగలడంతో షాక్​కు గురయ్యాడు. మృతుడు మెదక్​ జిల్లా సదాశివపల్లి నుంచి ఉపాధి కోసం హైదరాబాద్​కు మూడేళ్ల క్రితం వలస వచ్చాడు.

మొదట అతని పరిస్థితి విషమంగా ఉందని కంపెనీ యాజమాన్యం కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. వారు వచ్చేలోపే అతను విగతజీవిగా పడి ఉన్నాడు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మృతుని కుటుంబసభ్యులు అక్కడే నిరసన తెలియజేశారు. అతని ముగ్గురు పిల్లలు ఉండడంతో పెద్ద దిక్కును కోల్పోయామని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.