వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మంథని ఎస్బీఐ శాఖలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
అతన్ని భూపాలపల్లికి చెందిన శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.