సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామ సర్పంచ్ భర్త విక్రమ్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతుండటం వల్ల గ్రామంలో చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు అక్కడి స్నేహితులతో వెళ్లాడు.
మాట మాట పెరిగి...
ఈ క్రమంలో చెరువు వద్దకు ఎవరు రావొద్దని మహేశ్‌ను గ్రామ సర్పంచ్ భర్త విక్రమ్ మందలించాడు. చెరువు వద్ద ఇద్దరికీ మాట మాట పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని పాత కక్షలని మనసులో పెట్టుకుని తనపై దాడి చేసినట్లు మహేశ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. తన చేతి వేలికి గాయం చేశాడని సర్పంచ్ భర్త విక్రమ్ మహేశ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.