వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌కు వరంగల్ జిల్లా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. కేసుకు సంబంధించి 67 మంది సాక్ష్యులను విచారించినట్లు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
ఈ ఏడాది మే 20న వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో పాడుపడిన బావిలో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమబంగా నుంచి వచ్చి.. వరంగల్‌లో స్థిరపడిన మక్సూద్ అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్యకు గురయ్యారు. మక్సూద్ ఇంటి పక్కనే నివాసం ఉండే ఇద్దరు బిహారీ యువకులూ హత్యకు గురయ్యారు. కేసు మిస్టరీని పోలీసులు 72 గంటల్లోనే ఛేదించి నిందితుడు సంజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
ఒక హత్యను కప్పి పుచ్చుకోవడానికి 9 హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలో ఉండగానే అందరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేసి సామూహికంగా హత్యలు చేసినట్లు పోలీసులు నిరూపించారు. ఘటన జరిగిన నెల రోజుల్లోపే దర్యాప్తు పూర్తిచేసి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
"సంజయ్ కుమార్ 9 మందిని హత్య చేశారనే నేరం నిరూపణ అయింది. ఆయనకు ఉరి శిక్ష విధించారు. పోలీసు వారు ఓరల్, డాక్యుమెంటరీ, సైంటిఫిక్, మెడికల్ ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా కలెక్ట్ చేశారు. మా వాదనుల గట్టిగా వాధించాము. ఇక్కడిచ్చిన జడ్జిమెంట్... హైకోర్టుకెళ్లినా, సుప్రీంకోర్టుకెళ్లినా కన్ఫామ్ అవుతుందని భావిస్తున్నాం. అక్కడ కూడా మా వాదనలు గట్టిగా వినిపిస్తాం. ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తాం. తొమ్మిది మందిని అతికిరాతకంగా హత్య చేశారని కోర్టు నిర్ధరించింది. ఒక అమ్మాయిని అత్యాచారం కూడా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి మరణ శిక్ష విధించింది." - న్యాయవాది
ఇవీచూడండి: గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువు