ETV Bharat / jagte-raho

రేషన్​ బియ్యం అక్రమ తరలింపు.. 180 క్వింటాళ్లు స్వాధీనం

ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని.. 180 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Sangareddy district Zaheerabad police seized 180 quintals of ration rice while it was being smuggled
రేషన్​ బియ్యం అక్రమ తరలింపు.. 180 క్వింటాళ్లు స్వాధీనం
author img

By

Published : Aug 8, 2020, 6:54 AM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని బైపాస్ రోడ్డులో రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్​కు అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు మూడు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ చౌక దుకాణాలు, రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి గుజరాత్​లో అమ్మేందుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లారీ డ్రైవర్​పై కేసు నమోదు చేసి బియ్యం తరలింపునకు పాల్పడుతున్నవారి ఆచూకీ తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.