ETV Bharat / jagte-raho

ఇసుక అక్రమార్కుల గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్​ - రాచకొండ కమిషనరేట్​లో తాజా నేర వార్తలు

ఇసుక అక్రమ రవాణాదారులపై రాచకొండ పోలీసులు కొరడా ఝుళిపించారు. అక్రమార్కులపై ఏకకాలంలో దాడులు చేసి.. భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Sand smuggling conspiracy.. Six arrested
ఇసుక అక్రమార్కుల గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్​
author img

By

Published : Jul 20, 2020, 12:20 PM IST

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పొరుగుసేవల సిబ్బందితో కలిసి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.3 లక్షల 20 వేల నగదు, ల్యాప్​టాప్​, ప్రింటర్, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వే బిల్లులు సృష్టించి యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

లారీలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో సోదాలు జరిపామని పోలీస్ కమిషనర్​ మహేశ్​ భగవత్​ పేర్కొన్నారు. ఇసుక మాఫియా, నకిలీ వే బిల్లుల తయారీపై డ్రైవర్​ను విచారించినట్లు వెల్లడించారు. నిందితులు నవీన్, కిరణ్, రాజశేఖర్ ఇసుక రాకెట్​ను నడిపిస్తున్నారని వివరించిన ఆయన.. లారీ యజమానిని పిలిపించి విచారించామని తెలిపారు. ఏటూరు నాగారంలో నిందితులను పట్టుకున్నామని వివరించారు.

గుత్తేదారు కిరణ్‌కుమార్‌ మార్చి నుంచి ఇసుక క్వారీ నిర్వహిస్తున్నాడని సీపీ పేర్కొన్నారు. మల్యాల క్వారీ నుంచి ఇప్పటి వరకు సుమారు 500 లారీల ఇసుకను అక్రమంగా తరలించారన్నారు. జనవరి నుంచి జూన్‌ వరకు రూ.15 లక్షలకు క్వారీని లీజుకు తీసుకున్నారన్న ఆయన.. మణుగూరులో మరో క్వారీ వద్ద నకిలీ బిల్లులు సృష్టించారని స్పష్టం చేశారు.

ఇదీచూడండి: గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.