హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అజాంపుర చమన్ వద్ద రౌడీ షీటర్ సజీద్పై దుండగులు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడి అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో సజీద్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్ష్యలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.