ETV Bharat / jagte-raho

పాఠశాలలో దొంగలు... ఎల్​ఈడీ టీవీ, స్టెబిలైజర్​ చోరీ

వేసిన తాళం వేసినట్లే ఉంది. ఇన్ని రోజులు మూతపడి ఉంది కదా... తుప్పు పట్టిందనుకున్నారు. తీరా పగులగొట్టి చూస్తే... అప్పుడర్థమైంది. పాఠశాలలు మూసి ఉండటాన్ని దొంగలు సద్వినియోగం చేసుకుని గుల్ల చేశారని...!

పాఠశాలలో దొంగలు... ఎల్​ఈడీ టీవీ, స్టెబిలైజర్​ చోరీ
పాఠశాలలో దొంగలు... ఎల్​ఈడీ టీవీ, స్టెబిలైజర్​ చోరీ
author img

By

Published : Aug 30, 2020, 12:48 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం ప్రాథమిక పాఠశాలలో దొంగలు పడ్డారు. పాఠశాలలోని రూ.10వేల విలువ గల ఎల్ఈడీ టీవీ, స్టెబిలైజర్​ను దుండగులు ఎత్తుకెళ్లారు. కరోనా వైరస్ వల్ల పాఠశాలలు అన్ని మూతపడే ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన దొంగలు... టీవీ ఉన్న గది తాళం పగులగొట్టి ఎల్ఈడీ టీవీ, స్టెబిలైజర్​ను ఎత్తుకెళ్లారు.

మళ్లీ ఎప్పటిలా తెలియకుండా గదికి తాళం వేసి వెళ్లారు. కాగా... ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 28న ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు. గది తాళం కొత్తది కావడం... ఎంతకీ రాకపోవటం వల్ల అనుమానంతో తాళం పగులగొట్టి లోపల పరిశీలించగా... దొంగలు పడినట్లు గుర్తించారు. ఉపాధ్యాయులు విషయాన్ని వెంటనే మిరుదొడ్డి పోలీసులకు తెలియజేయగా... పాఠశాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.