హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హుస్సేని ఆలం కోకతొట్టి ప్రాంతంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
గుర్తుతెలియని దుండగులు రూ. 10 లక్షలు విలువైన 20 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వివరించారు. క్లూస్‌టీం సహాయంతో పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిః ఎస్సై పేరిట నకిలీ ఫేస్బుక్... హెడ్ కానిస్టేబుల్‌కు టోకరా