రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధి కొకాపేట ఓఆర్‌ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
లారీ వెనుక టైర్లు ఇద్దరు వ్యక్తులపై నుంచి దూసుకెళ్లాయి. దీంతో తలకు పెట్టుకున్న హెల్మెట్ సైతం పగిలి ముక్కలైంది. ఆ ప్రాంతంలో రోడ్డు రక్త సిక్తంగా మారింది. అసలు ప్రమాదం ఏలా జరిగింది అనే కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇదీ చూడండి : ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 22 మందికి గాయాలు