సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. డెకరేషన్ పూలతో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు కల్హేర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ ద్విచక్రహహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న కారు.. అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో శ్రీకాంత్ గౌడ్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రియుడి మోజులో పడి.. సినీ ఫక్కీలో భర్త హత్య..