విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కడెంపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది.
అదుపు తప్పి...
కోస్గి పట్టణానికి చెందిన శంకర్, అతని కుమారుడు సాయి కుమార్‌తో కలిసి ధన్వాడలో ఉన్న తన కూతురిని తీసుకురావడానికి కారులో బయలుదేరారు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. సాయి కుమార్‌కు తీవ్ర గాయలయ్యాయి. అతనిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ఆహారం తిరస్కరించిన దంపతులు.. చిత్రవిచిత్ర ప్రవర్తన..!