నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బైక్పై ముగ్గురు వ్యక్తులు జడ్చర్ల నుంచి కోదాడ వైపుకి ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు తిమ్మాజీపేట మండలం లక్ష్మణ్ నాయక్ తండా వాసులు రామ్లానాయక్(36), వాల్యానాయక్(37) గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు మల్లయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇవాళ ఎస్ఈసీ భేటీ