ETV Bharat / jagte-raho

లారీ, డీసీఎం ఢీ.. ఇద్దరు మృతి - మేడ్చల్​ జిల్లా ప్రమాదం వార్తలు

డీసీఎం వాహనాన్ని ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మరణించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మేడ్చల్​ జిల్లా శామీర్​పేట్​ సమీపంలో జరిగింది.

road-accident-in-medchal-district-shameerpet-two-died
లారీ, డీసీఎం ఢీ.. ఇద్దరు మృతి
author img

By

Published : Jan 6, 2021, 6:48 PM IST

నెమ్మదిగా వెళుతోన్న డీసీఎం వాహనాన్ని ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన మేడ్చల్​ జిల్లా శామీర్​పేట్​ సమీపంలోని బాహ్యవలయ రహదారి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్​కు చెందిన సయ్యద్ గౌస్ డీసీఎంలో గ్లాస్ లోడుతో మంచిర్యాలకు వెళుతున్నాడు. బాహ్యవలయ రహదారిపై ఆపి బిహార్ రాష్ట్రానికి చెందిన పంకజ్, మాదవ్ కుమార్, రవీందర్​లను తన వాహనంలో ఎక్కించుకున్నాడు. డీసీఎంను రోడ్డు పక్కకు ఆపడానికి నెమ్మదిగా వెళుతున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంకజ్, మాదవ్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా రవీందర్​కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా... మరిన్ని కఠిన చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.