జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒక డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వాహనాల్లో చిక్కుకున్న ఇద్దరూ సుమారు గంట పాటు నరకయాతన అనుభవించారు.
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అతి కష్టం మీద ఇద్దరు డ్రైవర్లను బయటకు తీశారు. అందులో ఒకరు మరణించగా.. గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్ సమీపంలో అగ్నిప్రమాదం