ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదం: ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

author img

By

Published : Nov 24, 2020, 9:10 AM IST

వికారాబాద్​ జిల్లా పాతూర్​ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏసీ వాహనం అదుపుతప్పి బైక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ROAD ACCIDENT AT VIKARABAD
రోడ్డు ప్రమాదం: ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

టాటా ఏసీ వాహనం అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఒకరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వికారాబాద్​ జిల్లా పాతూర్​ సమీపంలో ఈ ఘటన జరిగింది.

వికారాబాద్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన యువకులు హరికృష్ణ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, వేణువర్ధన్​రెడ్డి.. బైక్​పై వికారాబాద్​ నుంచి పాతూర్​ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హరికృష్ణ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైదరాబాద్​కు తరలించారు.

వికారాబాద్​ ఏరియా ఆస్పత్రిలో హరికృష్ణరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో పాతూర్​లో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: మంత్రాల నెపంతో రైతు దారుణహత్య..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.