సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి గ్రామంలో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న బండ్ల సంతోష్(27) అనే యువకుడు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌కు ఉన్న ఇనుప నాగలి ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.
ఖమ్మం పట్టణానికి చెందిన బండ్ల సంతోష్ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) బంధువుల ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదకరంగా ట్రాక్టర్‌పై ఇనుప నాగలి తగిలించుకుని అతివేగంగా ట్రాక్టర్‌ను నడపడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. సంతోష్ బంధువులు ఆరోపిస్తున్నారు. నాగలి ఉన్న ఇనుప చువ్వలు గొంతులో దిగుబడి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్