వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 44పై ఓ ద్విచక్ర వాహనం.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీపై ఉన్న సురేందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తిరుపతిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రుడ్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితులు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.