సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ సిద్దిపేట జిల్లా ములుగు వద్ద టైర్ పంచర్ అయింది. రోడ్డు పక్కన లారీని నిలిపి మరమ్మతులు చెస్తున్నారు. ఇదే క్రమంలో సిద్దిపేట నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ లారీని వెనకనుంచి అతి వేగంగా లారీని ఢీ కొట్టింది.
డీసీఎంలో ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా పాణ్యం మండలం కూచునుడుకు చెందిన అయ్యస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!