ETV Bharat / jagte-raho

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి - సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పిట్టలగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి

author img

By

Published : Nov 9, 2020, 5:03 PM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పిట్టల గూడెం సమీపంలో జరిగింది. వెంకట్ రెడ్డి చెరువు వద్ద ఆదివారం రాత్రి ఫైబర్ కేబుల్ వేయడానికి తీసిన కాలువలో పడి చేర్యాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

చేర్యాల పట్టణానికి చెందిన ఘనపురం జీవన్(22), కనికరం మహేష్(21) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు గోతిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేర్యాలలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: టైరు పగిలి లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.