సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం లింగరాజుపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మార్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల సంజీవులు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వ్యక్తిగత పని నిమిత్తం గజ్వేల్‌కు వెళ్లిన సంజీవులు... తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంజీవులు... అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంతోషంగా పండుగ జరుపుకున్నామనుకున్న సమయంలో పిడుగు లాంటి వార్త విని ఆ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.