గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం శివారులో 44 నెంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారు.. కర్నూల్ వైపు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది.
కారులో ప్రయాణిస్తున్న గిరి, కేశవులు, వెంకట్రాములు, దీపా, తేజ, కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108, హైవే అంబులెన్స్‌లో ఏపీలోని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేశవుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: యువకుల మధ్య తగాదా.. కత్తితో దాడి