ETV Bharat / jagte-raho

చలివేస్తుందని ఆగాడు.. అనంతలోకాలకు పోయాడు - యాదాద్రి జిల్లా క్రైం వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలీ కుమారుడు షేక్‌ షారుఖ్‌(22)గా పోలీసులు గుర్తించారు.

road accident at dharmojigudem in yadadri district ex mla son was died
చలివేస్తుందని ఆగాడు.. అనంతలోకాలకు పోయాడు
author img

By

Published : Nov 4, 2020, 8:26 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్​వలీ కుమారుడు షేక్‌ షారుఖ్‌(22) తన స్నేహితుడు ఫయాజ్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. చౌటుప్పల్ సమీపంలోని ధర్మోజిగూడెం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే చలి వేస్తోందని ద్విచక్రవాహనాన్ని హైవే పక్కన నిలిపి స్వెట్టర్‌ ధరిస్తున్నారు. ఈ సమయంలో చౌటుప్పల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై కూర్చొని ఉన్న షారుఖ్‌ అక్కడిక్కడే మృతి చెందారు. ఫయాజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.