ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చించోలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు నిర్మల్లోని బాగులవాడకు చెందిన మైసర్ల లక్ష్మణ్ (22), సాయి తేజ్ రెడ్డి (24) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి:- ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు